ఏపీ విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి పాలిసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పాలిసెట్ ప్రవేశాలకు నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటినుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 16వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు.

ఈ నెల 18న సీట్లను కేటాయిస్తారు. 23 నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. పాలిసెట్ కౌన్సిలింగ్ కు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఇక అటు పీజీ వైద్య విద్య ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2023-24 విద్యా సంవత్సరానికి 2022-23లో ఉన్న వార్షిక ఫీజులపై 15% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ కోర్సులో… పిజి సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ‘ట్యూషన్’ ఫీజు కింద రూ.17,25,000 తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఈ పెంపు ఐదు ప్రైవేట్ కళాశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version