తమిళంలో వచ్చే వారం రిలీజ్ కాబోతున్న సినిమా 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈమధ్యన రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమా మీద ఆసక్తి కలిగించాయి. అయితే ఇంకా రిలీజ్ అవని ఈ సినిమా రీమేక్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రముఖ దిల్ రాజు 96 రీమేక్ రైట్స్ కొనేశారట. సినిమా చూసి కొన్నారో లేక ట్రైలర్ చూసి కొన్నారో తెలియదు కాని 96 రీమేక్ పై కన్నేశాడు దిల్ రాజు.
ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ లో నాని, సమంత జోడి కడతారని తెలుస్తుంది. ఆల్రెడీ నాని చూచాయగా ఈ సినిమా రీమేక్ కు ఓకే చెప్పాడట. సమంత కూడా ఒప్పుకుంటే ఇక ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టే. పెళ్లి తర్వాత కొత్త టర్న్ తీసుకున్న సమంత సినిమా సెలక్షన్స్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సినిమా టైటిల్ లో కూడా సస్పెన్స్ దాగి ఉందని అంటున్నారు.
మొత్తానికి తమిళంలో అక్టోబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ 96 సినిమా అక్కడ హిట్ కొడితే ఆ వెంటనే తెలుగు రీమేక్ సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలు పెడతారట. దిల్ రాజు మెచ్చి హక్కులు తీసుకున్నాడంటే సినిమా తప్పకుండా మంచి ఫలితం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.