OTTలో నాని ‘అంటే సుందరానికి’..స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

-

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని-మాలీవుడ్ క్యూట్ బ్యూటీ నజ్రియా జంటగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ముందుకు సాగింది. కానీ, ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో ఎంగేజ్ చేయలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ టైమ్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో వచ్చే నెల 8 నుంచి ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మతాంతర వివాహం అనే టాపిక్ పైన ఈ సినిమా లో డైరెక్టర్ డిస్కస్ చేశారు.

ఈ పిక్చర్ ద్వారా మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో సీనియర్ హీరో నరేశ్, రోహిణి, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version