పర్సనల్ లైఫ్ ఆధారంగా .. నరేష్ – పవిత్ర లోకేశ్‌ ‘మళ్లీ పెళ్లి’ టీజర్‌

-

నరేశ్, పవిత్ర.. ఈ పేర్లు టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. వీరు తమ కెరీర్‌ పరంగా కంటే వ్యక్తిగత విషయాల వల్ల లైమ్ లైట్‌లో ఎక్కువగా ఉంటారు. ఇప్పటికే చెరో మూడు పెళ్లిల్లు చేసుకున్న ఈ ఇద్దరూ ఒకరితొ ఒకరు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెళ్లిపీటల దాకా ఎక్కించారు. న్యూ ఇయర్ రోజున పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరికొన్ని రోజుల తర్వాత వివాహమైనట్లు ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంతకీ వీరి పెళ్లి నిజంగానే జరిగిందా లేదా అని ఇప్పటికీ క్లారిటీ లేని మ్యాటర్.

అయితే ఇప్పుడు పవిత్ర నరేశ్‌లు మరో క్రేజీ స్టంట్ చేశారు. ఈసారి ఏకంగా తమ రియల్ లైఫ్ స్టోరీని రీల్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నరేశ్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన, జరుగుతోన్న సంఘటన ఆధారంగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వంలో.. ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘మళ్లీ పెళ్లి’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో నరేశ్ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించగా.. సినీ నటిగా పవిత్ర లోకేశ్‌ను చూపించారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జయసుధ, శరత్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version