స్టార్ హీరోయిన్ నయన తారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిల్, తెలుగు రెండింటా మంచి క్రేజ్ తెచ్చుకుంది నయన తార. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార హీరోయిన్ గానే కాకుండా పలు ఎన్నో వివాదాలు, ఎఫైర్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ప్రభుదేవా, శింబు వంటి వారితో ప్రేమాయణం నడిపి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో Mega157 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో చిరుకి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతారను చిత్ర బృందం ఫిక్స్ చేసింది. సంక్రాంతి 2026 – రఫ్ఫాడించేద్దాం అని ట్వీట్ చేసింది. నయనపై ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఈ మూవీ త్వరలో రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. చిరంజీవి, నయనతార గతంలో సైరా నరసింహారెడ్డి, ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో కలిసి నటించారు.