Rana Naidu Teaser : ‘రానా నాయుడు’ టీజర్‌ విడుదల

-

దగ్గుబాటి హీరోస్ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ విడుదల అయింది. యాక్షన్‌, క్రైమ్‌ నేపథ్యంలో సిద్ధమైన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా నటించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘సాయం కావాలా?’ అనే రానా సంభాషణలతో మొదలైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘మీ సాయం గురించి మేమెంతో విన్నాం. సెలబ్రిటీ ఎవరైనా సమస్యల్లో ఉంటే.. వాళ్లు నీకే ఫోన్‌ చేస్తారు. ఫిక్సర్‌ ఫర్‌ ది స్టార్స్‌’, ‘రానా భాగమయ్యాడంటే అది భారీ కుంభకోణమే అయి ఉంటుందని ఈ నగరం మొత్తం చెప్పుకొంటోంది’ అనే సంభాషణలు రానా పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా ఉన్నాయి.

రానా తండ్రి పాత్రలో వెంకీ వృద్ధుడిగా కనిపించిన తీరు ఔరా అనిపించేలా ఉంది. టీజర్‌ చివర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మెప్పించేలా సాగాయి. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version