సంక్రాంతి తర్వాత అమరావతి పనులు ప్రారంభం

-

సంక్రాంతి తర్వాత అమరావతి పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు ఏపీ మంత్రి నారాయణ. విజయవాడ నరేడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్)సెంట్రల్ జోన్ డైరీ 2025 ను ఆవిష్కరించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. .గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు… మూడు ముక్కలాటతో అమరావతినీ గత పాలకులు నాశనం చేశారని ఆగ్రహించారు. రెండో సారి సీఎం నాకు మళ్ళీ పురపాలక శాఖ అప్పగించి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిపారు.

amaravathi

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తీసుకొచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని… భవన నిర్మాణాలు, లే అవుట్ లకు అనుమతులనుండరాలతరం చేస్తూ ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 500 మీటర్లు కంటే పైన నిర్మాణాలు చేసే భవనాలు కు సెల్లార్ అనుమతులు ఇస్తున్నాం..లే అవుట్ లలో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లను 9 మీ తగ్గించామని గుర్తు చేశారు. అన్నీ అనుమతులు తేలికగా వచ్చేలా సింగిల్ విండో ఆన్ లైన్ సిస్టమ్ తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా సింగిల్ విండో విధానం అందుబాటులోకి తెస్తాం… భవన నిర్మాణాలకు 15 రోజుల్లోనే అనుమతులు వచ్చేలా మార్పులు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version