బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ తొలి ఇన్సింగ్స్ స్కోర్ 369గా నమోదు అయింది. సెంచరీతో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి..స్పీడ్ గా ఆడే ప్రయత్నంలోనే.. వికెట్ కోల్పోయాడు. బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు… నితీష్ 114, జైస్వాల్ 82, సుందర్ 50 పరుగులు చేశారు.
అటు ఆసీస్ బౌలర్లలో కమీన్స్, బొలాండ్, లయన్ కు తలో 3 వికెట్లు తీశారు. కాగా, నిన్నటి రోజున బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసి తెలుగోడి సత్తా చాటాడు. ఆస్ట్రైలియాతో ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్ తొలి టెస్ట్ తో ఆరంగేట్రం చేసిన 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో బాక్సింగ్ డే టెస్ట్ లో 171 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ మైలు రాయిని చేరుకున్నాడు.