సమంతకు మరో తలనొప్పి.. ‘ఆరాధ్య’ సాంగ్​లో ఓ సీన్​పై నెటిజన్ల ట్రోలింగ్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై మరోసారి నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. ఈ భామ విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో నుంచి ఆరాధ్య అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో విజయ్-సామ్​ల కెమిస్ట్రీ అదిరిపోయింది. వారి మధ్య వచ్చే సన్నివేశాలు, మ్యూజిక్, లిరిక్స్ అన్నీ సరిగ్గా సెట్ అయ్యాయి. అయినా నెటిజన్లు ఈ పాటపై ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి గల కారణం ఈ సాంగ్​లోని ఓ సన్నివేశం. దానివల్ల ఇప్పుడు మరోసారి సామ్ ట్రోలింగ్​కు గురవుతోంది. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే..?

ఆరాధ్య పాటలో విజయ్ దేవరకొండ సోఫాలో పడుకుని.. సమంత కుడి చేతిని తన కాలితో టచ్ చేస్తున్నట్లు కనిపించారు. దీన్ని చూసిన కొందరు సోషల్​మీడియా యూజర్స్​.. సామ్ గతంలో ఓ సినిమాపై చేసిన ట్వీట్​ను బయటకు తీసి మరీ ట్రోలింగ్ షురూ చేశారు. గతంలో సామ్ ఓ సినిమాకు సంబంధించి ట్వీట్ చేస్తూ.. ‘ఇంకా రిలీజ్ అవ్వనీ ఓ మూవీ పోస్టర్ చూశాను. అది చూడంగానే నా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి’ అని రాసుకొచ్చింది.

అయితే అది మహేశ్​ ‘1 నేనొక్కడినే’ సినిమాకు సంబంధించిన పోస్టర్​ అని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. అందులో మహేశ్ బీచ్​లో నడుస్తుండగా.. ఆయనే వెనకే హీరోయిన్​ మోకాలి మీదు పాకుతూ కనిపిస్తుంది. దాన్ని ఉద్దేశించే సామ్​ అలా ట్వీట్​ పెట్టిందని అన్నారు. ఇప్పుడు ఆ పోస్టర్​ను-‘ఖుషి’ సెకండ్​ సింగిల్​ ఆ స్టిల్​ను పక్కపక్కన జోడించి ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version