ఆసక్తి రేపుతున్న నిఖిల్ స్పై ట్రైలర్

-

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత నిఖిల్ 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన స్పై అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 29న గ్రాండ్‌గా విడుదలకానుంది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ .. అమీర్ పేటలోని AAA సినిమాస్ లో నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ .. ఛేజింగ్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ట్రైలర్ చివర్లో రానా మెరవడం విశేషం.

నిఖిల్ జోడీగా ఐశ్వర్య మీనన్ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో సన్యా ఠాకూర్ .. ఆర్యన్ రాజేశ్ .. జిషు సేన్ గుప్తా .. మకరంద్ దేశ్ పాండే .. అభినవ్ గౌతమ్ కనిపించనున్నారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణం .. దాని వెనుక గల రహస్యం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. నిఖిల్ ఫెస్టి టైమ్ చేస్తున్న భారీ యాక్షన్ మూవీగా దీనిని గురించి చెప్పుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version