టాలీవుడ్ హీరో నితిన్ రచ్చ చేశాడు. థియేటర్లో డాన్స్ చేసిన హీరో నితిన్.. ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాడు. హీరో నితిన్ నటించిన ‘ఇష్క్’ మూవీ రీ రిలీజైంది. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో అభిమానులతో కలిసి నితిన్ కూడా ఈ సినిమా వీక్షించారు.
ఈ క్రమంలో సినిమాలోని పాటలకు ఆయన డాన్స్ వేశారు. ఇప్పుడు థియేటర్లో డాన్స్ చేసిన హీరో నితిన్.. వీడియో వైరల్ గా మారింది. కాగా, టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా మూవీ రాబిన్ హుడ్. ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. మూత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నెని, రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి గ్లింప్స్ ఆక్టుకున్నాయి.