ఫ్రైడ్ రైస్ లో బొద్దింక… రెస్టారెంట్ పై బన్నీ హీరోయిన్ సీరియస్

-

Nనివేదా పేతురాజ్… ఈ భామ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాతో నివేదా పేతురాజ్ బాగా పాపులర్ అయింది. “మెంటల్ మదిలో” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ …. ప్రస్తుతం సైడ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఎక్కువగా కనిపిస్తోంది. చిత్రలహరి, బ్రోచే వారెవరు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది నివేదా. ఎంతో సున్నితంగా ఉండే నివేద తాజాగా.. ఓ రెస్టారెంట్ ఫైర్ అయింది. అదేంటి హీరోయిన్ రెస్టారెంట్ తో గొడవ ఏంటి అని అనుకుంటున్నారా? అవును ఇది నిజమే.

అసలు వివరాల్లోకి వెళితే… నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది నివేద పేతురాజ్. అయితే డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్సిల్ తెరవగానే ఆమె షాక్ కు గురైంది. అందులో ఓ బొద్దింక నివేదకు దర్శనమిచ్చింది. దీంతో నివేద సదరు రెస్టారెంట్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి రెస్టారెంట్లకు జరిమానాలు విధించాలని ప్రభుత్వాన్ని సైతం డిమాండ్ చేసింది. ఫ్రైడ్ రైస్ లో వచ్చిన బొద్దింక ఫోటోను కూడా నివేదా తన సోషల్ మీడియాలో అందరికి షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version