NBK 108 : బాలయ్య సినిమాలో బాహుబలి బ్యూటీ !

-

బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలయ్య సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాదు అంతకుమించి కలెక్షన్లు కూడా వసూలు చేసింది. సంక్రాంతి సినిమాగా వచ్చిన ఈ సినిమా కొంతమేర నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతకు మంచి ప్రాఫిట్ అందించింది.

బాలకృష్ణ సినిమా చేస్తే మినిమం సక్సెస్ అనే విధంగా సినిమా ఉంటుందని ఇప్పుడు ఇండస్ట్రీలో బలమైన టాక్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణతో నిర్మాతలు కూడా సినిమాలు చేయాలని పోటీపడుతున్నారు. ఇక ముందుగా ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం బాలయ్య బాబు దూసుకుపోతున్నారు… ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, బాలయ్య 108 సినిమాలో బాహుబలి బ్యూటీ నోరా ఫతేహి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బ్యూటీ.. ఇందులో ఓ ఐటెం సాంగ్‌ చేయనుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version