నేను స్టార్ హీరోయిన్ అయింది లస్ట్ స్టోరీస్ వల్లే ..షాకిచ్చిన కియారా అద్వాని ..!

-

కియారా అద్వాని ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈ సక్సస్ ఎవరూ ఊహించనిది. తెలుగు లో కియారా అద్వాని భరత్ అనే నేను సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అన్నంతగా పాపులర్ అయింది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమాలో మరో లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు స్టార్ హీరోలు ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ తో అవకాశాలు రాగానే ఇక కియారా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిలవుతుందని అనుకున్నారు.

 

కానీ వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా చరణ్ కి కూడా ఊహించని షాకిచ్చింది. బోయపాటి శ్రీను మీద నమ్మకం పెట్టుకొని మాస్ హిట్ కొట్టాలన్న చరణ్ ఆశలన్ని నీరుగారిపోయాయి. ఒక్క చరణ్ మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం వినయ విధేయ రామ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకుంది. అందుకు కారణం అల్లు అర్జున్ కి బోయపాటి సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ ని ఇవ్వడమే. కాని బోయపాటి బాగా నిరాశపరచాడు. అంతేకాదు ఈ సినిమా బోయపాటి శ్రీను కెరీర్ మీదా బాగా ప్రభావం చూపించింది. ఇక కియారా అయితే మళ్ళీ టాలీవుడ్ లో కనిపించలేదు. కాని బాలీవుడ్ లో ఈ రోజు కియారా అద్వానీ స్టార్ హీరోయిన్.

 

బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో తీసిన లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసింది కియారా అద్వాని. కరణ్ జోహార్ లాంటి పాపులర్ డైరెక్టర్స్ తీసిన ఈ వెబ్ సిరీస్ లో కూడా రాధికా ఆప్టే, మనీషా కోయిరాల, నేహా ధూపియా, భూమి పడ్నేకర్, సంజయ్ కపూర్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా వాళ్ళందరికంటే కియారా విపరీతమీన పాపులారిటిని సాధించింది. దీని ద్వారానే తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో కియారా కి అవకాశం వచ్చింది. ఇదంతా లస్ట్ స్టోరీస్ లో చేసిన క్యారెక్టర్ తో వచ్చిన పాపులారిటీనే. ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది. అక్షయ్ కుమార్ తో రెండవ సినిమా చేస్తుంది. అంతేకాదు బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కియారానే. అందుకే కియారా నేను స్టార్ హీరోయిన్ అవడానికి కారణం లస్ట్ స్టోరీస్ అని గర్వంగా చెబుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version