నిన్న అమీగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే, ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే… ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తానన్నారు NTR. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ఒక్కోసారి సినిమాలు చేసేటప్పుడు చెప్పడానికి ఏమీ ఉండదు. ప్రతి గంట ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, మీ ఉత్సాహం అర్థమవుతుంది. కానీ వీటి వల్ల ఒక్కోసారి నిర్మాతలు, దర్శకుల మీద చాలా ఒత్తిడి పడుతుందని తెలిపారు.
అభిమానులకు ఏదో ఒకటి చెప్పాలని వారు టెన్షన్ పడతారు. అలా అని ఏదో ఒకటి చెప్పడం కూడా కష్టం. ఒకవేళ అలా చెప్తే మీరు ఊరుకుంటారా? నచ్చకపోతే మళ్లీ వాళ్లనే తిడతారు. ఇది కేవలం నా ఒక్కడికే కాదు. చాలామంది ఇదే ఒత్తిడికి లోనవుతున్నారు. అప్డేట్ అనేది ఏమైనా ఉంటే ఇంట్లో ఉండే మా భార్య కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకంటే మీరందరూ మాకు చాలా ముఖ్యం. నేను చెప్తుంది కేవలం నా గురించే కాదు. నాలాగే ఉన్న ఇంకా చాలామంది హీరోల తరపున చెబుతున్నాను. అప్డేట్ ఉంది అంటేనే చెప్తాం. అదిరిపోయే అప్డేట్ ఉంటేనే మీకు చెప్తామన్నారు ఎన్టీఆర్.
The one thing I am very happy about hero full clarity tho vunnadu about his next project and future projects . Adiripoye update vachevaraku wait cheddam hero paina confidence pettukondi no turning back going forward 🔥🔥🔥🔥 #ManOfMassesNTR #NTR𓃵 #NTR30 #NTRGoesGlobal pic.twitter.com/vUuViHhaN0
— Mr Perfect (@kantri_munna09) February 6, 2023