‘నా ప్రతి కన్నీటి చుక్కకు బాధపడ్డ అభిమానులకు.. పాదాభివందనం’.. సైమా వేడుకలో ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ స్పీచ్

-

దుబాయ్‌ వేదికగా సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2023 వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజులు జరగనున్న ఈ వేడుకల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటీనటులు హాజరై సందడి చేస్తున్నారు. ఈనెల 15,16వ తేదీల్లో జరుగుతున్న ఈ వేడుకలో తెలుగు, కన్నడ నటులు సందడి చేశారు. సైమా 2023 వేడుకల్లో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ అవార్డు గెలుచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అసమాన నటనకు గానూ ఆయన ఈ పురస్కారం గెలుచుకున్నారు.

అవార్డు అందుకున్న అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఎమోషనల్ అవుతూ తన ఫ్యాన్స్​కు పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఎన్టీఆర్ ఎమోషనల్ అవ్వడం చూసి హార్ట్ టచ్ చేశాారు అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘‘నా కష్టనష్టాల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు. నన్ను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో కొమురం భీమ్‌ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు. ఇక నా సహనటుడు, నా సోదరుడు, స్నేహితుడు చరణ్‌కు కూడా ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను’’ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version