OG: పవన్ కళ్యాణ్ అభిమానులకు సమ్మర్ ట్రీట్ అందింది. సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ మూవీ షూటింగ్ ఇవాళ ప్రారంభం అయినట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారా ? లేదా ? అనేదానిపై క్లారిటీ లేదు. కాగా ఈ చిత్రంలో ప్రియాంక మోహన్. శ్రియ రెడ్డి. ఇమ్రాన్ హాష్మీ. అర్జున్ దాస్ కీలకపాత్ర వహించనున్నారు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా మరియు ఇతర శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నారు. .