పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఓ జి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదని చెప్పాలి.
ఇకపోతే షూటింగ్ అప్డేట్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి విషయంపై కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు కిక్కిచ్చే వార్తలను మేకర్స్ రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. అయితే.. సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్ గ్లింప్స్ విడుదల చేశారు. పంజా తర్వాత పవన్ కళ్యాణ్… గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయకపోవడంతో నిరాశగా ఉన్న అభిమానులు… తాజా అప్డేట్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.