అలాంటి సాహసం ఒక్క బాలకృష్ణకే సాధ్యం..!

-

తెలుగు సినిమా పరిశ్రమలో సాహసాలు చేయాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి. ముఖ్యంగా ఆ పాత్రలను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అన్న భయం తప్పకుండా ప్రతి హీరో లేదా హీరోయిన్ లో ఉంటుంది. కానీ కొన్నిసార్లు వారు చేసే ఆ పాత్రల వల్ల వారికి మంచి పేరు కూడా వస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా ఒక అరుదైన సాహసం చేసి, ఇండస్ట్రీలో మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.. పనే దైవంగా భావించి అంకితభావంతో పనిచేసే అతి కొద్ది మంది నటులలో స్టార్ హీరో బాలకృష్ణ కూడా ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ప్రయోగాలకు కూడా సై అంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే మాస్ హీరోగా రాణిస్తున్న సమయంలో భైరవద్వీపం లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో బాలయ్య కురూపిగా నటించడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే గ్లామర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిపై , కథపై నమ్మకం వుంచి సినిమాను తెరకెక్కించారు. అయితే బాలకృష్ణ ఈ సినిమాలో కురూపిగా కనిపించే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు ఏకంగా మేకప్ వేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టేదట.

ఒకసారి మేకప్ వేసిన తర్వాత సాయంత్రం వరకు తీయడానికి వీలు ఉండేది కాదు.. భోజనం చేయాలంటే మేకప్ తీయాలి.. మళ్ళీ రెండు గంటల సమయం వృధా అవుతుంది అని ఆలోచించిన ఆయన దాదాపు పది రోజులపాటు కేవలం జ్యూసులు మాత్రమే తీసుకునే వారట. ఇకపోతే సినిమా సన్నివేశంలో భాగంగా ముళ్ళు కాలిలో దిగబడిపోయి ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారట. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో కురూపిగా కనిపిస్తున్న విషయాన్ని థియేటర్లలో సినిమా చూసే వరకు ఎవరికీ తెలియదు. కానీ అభిమానులు ఒక్కసారిగా ఆయనను అలా చూసి ఆశ్చర్యపోయారట.అయితే అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచి ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిపోయింది. ఇకపోతే ఇలాంటి పాత్రలు చేయడం కేవలం బాలకృష్ణకు మాత్రమే సాధ్యమని చెప్పవచ్చు

Read more RELATED
Recommended to you

Exit mobile version