విశ్వక్ సేన్ “ఓరి దేవుడా” కోసం రామ్‌ చరణ్‌ !

-

విశ్వక్ సేన్ ప్రస్తుతం “ఓరి దేవుడా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా మిథిలా పల్కర్ నటిస్తోంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రామ్‌ చరణ్‌ స్పెషల్‌ గెస్ట్‌ గా రానున్నారట. ఈ ఈవెంట్‌ ను రాజమండ్రిలో రేపు నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version