అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఏడాది అవార్డుల్లో హాలీవుడ్ మూవీ ఓపెన్హైమర్ సత్తా చాటింది. ఏకంగా ఏడు పురస్కారాలను సొంతం చేసుకుంది. మరోవైపు ఈ వేడుకలో ఈ ఏడాది జాన్ సీనా ఎంట్రీ సంచలనంగా మారింది. నగ్నంగా వేదికపై వచ్చి ఆయన అవార్డును ప్రకటించడం వైరల్గా మారింది. మరోవైపు ఆస్కార్ అవార్డులు గెలిచిన చిత్రాలు ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు సినీ ప్రియులు. ఇంకెందుకు ఆలస్యం.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చూసేద్దామా?
ఓపెన్‌హైమర్ (oppenheimer) : జియో సినిమా (మార్చి 21 నుంచి అందుబాటులోకి రానుంది)
పూర్ థింగ్స్ (Poor Things): డిస్నీ+హాట్ స్టార్
ది హోల్డోవర్స్: అమెజాన్ ప్రైమ్
అమెరికన్ ఫిక్షన్: అమెజాన్ ప్రైమ్ వీడియో
అనాటమీ ఆఫ్ ఎ ఫాల్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: అమెజాన్ ప్రైమ్ వీడియో
బార్బీ (Barbie): జియో సినిమా
గాడ్జిల్లా మైనస్ వన్: ప్రస్తుతం అందుబాటులో లేదు