మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుకలు.. నాటు నాటుకు అవార్డు దక్కేనా..?

-

ఆస్కార్​ పురస్కారాల పండుగకు కౌంట్​డౌన్​ ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో ఈ వేడుక అట్టహాసంగా ప్రారంభం కానుంది. అమెరికాలోని లాస్​ ఏంజిల్స్​ వేదికగా ఇవాళ ఉదయం(భారత కాలమానం ప్రకారం) ఈ వేడుక జరగనుంది. అందుకు గాను వివిధ కేటగిరీల్లో నామినేట్​ అయిన సినిమాల బృందాలు ఇప్పటికే అమెరికా చేరుకున్నాయి.

టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా బృందం ఇప్పటికే లాస్ ఏంజిల్స్ లో సందడి చేస్తోంది. ప్రతి ఏటా జరిగే ఈ వేడుక కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు కాస్త ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం ఈసారి ఆస్కార్ కు తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట నామినేట్ అవ్వడం. మరి తెలుగుజాతికి ఆస్కార్ అందేనా లేదా మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.

ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో తెలుగు సినిమా ఆర్​ఆర్​ఆర్​లోని ‘నాటు నాటు’ పాటతో సహా మరో ఐదు పాటలు పోటీలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ‘టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌'(అప్లాజ్‌), ‘హోల్డ్‌ మై హ్యాండ్‌'(టాప్‌గన్‌.. మావెరిక్‌), ‘లిఫ్ట్‌ మీ అప్'(బ్లాక్‌ పాంథర్‌), ‘దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌'(ఎవ్రీథింగ్‌ ఎవీవ్రేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌) సినిమాల్లోని సాంగ్స్​ ‘నాటు నాటు’ పాటకు పోటీ ఇవ్వనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version