మోహన్ బాబు కుటుంబ గొడవలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు పహడీ షరీఫ్ పోలీసులు. మనోజ్,మోహన్ బాబు పెట్టిన కేసులపై విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయన్నారు. ఇళ్ళలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారని తెలిపారు.
మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటామని వివరణ ఇచ్చారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు నేనే పరిష్కరించానని.. కుటుంబాలు కలిసేలా చేశానని వెల్లడించారు.