పల్లవి ప్రశాంత్ సంచలన నిర్ణయం !

-

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలవడంలో ‘రైతుబిడ్డ’ ట్యాగ్ ఎంతగానో ఉపయోగపడింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ నుంచి ‘రైతుబిడ్డ’ ట్యాగ్ తీసేశారు.

pallavi

‘మల్లా ఒచ్చినా’, ‘బిగ్ బాస్ సెవెన్ విన్నర్’, ‘స్పై టీమ్ విన్నర్’ అని బయోలో మార్పులు చేశారు. ఇన్ స్టాలో ఇతడికి 11 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అల్లర్ల కేసులో నాలుగు రోజులు జైల్లో ఉండి నిన్న విడుదలయ్యారు ప్రశాంత్.

కాగా, బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రశాంత్ ఫ్యాన్స్ అల్లర్లు చేయడంతో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే కంటెస్టెంట్ల కార్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలకొట్టారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడా జైల్ కి తరలించారు. ఇక తాజాగా ప్రశాంత్‌ జైలు నుంచి రిలీజ్‌ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version