కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!

-

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. శివ శివ శంకర అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ విడుదల చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సాంగ్ విడుదలైంది. ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్, మోహన్ బాబు, మంచు విష్ణు వంటి వారి లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ లో మంచు విష్ణు అద్భుతంగా నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version