నాకంటే ప్రభాస్, మహేష్ బాబు చాలా పెద్ద హీరోలు – పవన్ కళ్యాణ్

-

నా కంటే ప్రభాస్, మహేష్ బాబు చాలా పెద్ద హీరోలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నిన్న వారాహి యాత్రలో భాగంగా ముమ్మడివరం సభలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ..ప్రభాస్‌, మహేష్ నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో.. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారని తెలిపారు.

రాంచరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారన్నారు పవన్‌ కల్యాణ్‌. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియకపోవచ్చు, కానీ వారు తెలుసు.. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండని కోరారు. రాజకీయాలకు వచ్చేసరికి సమష్టిగా ఆలోచిచండన్నారు పవన్‌ కల్యాణ్‌. పంట నష్టపోయిన రైతులను పరమర్శించడానికి వస్తే ప్రభుత్వం భయపడి ధాన్యం కొనుగోలు చేసింది.. 2024 ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే నా తడాఖా చూపిస్తానని కోరారు పవన్‌ కల్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version