రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఈశ్వర్, రాఘవేంద్ర అలాగే చత్రపతి లాంటి కొన్ని సినిమాలు చేసే సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్టు చేతిలో పడిన అనంతరం… పాన్ ఇండియా హీరో అయిపోయారు.

అయితే ఇప్పటికీ కూడా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి పై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి కీలక ప్రకటన చేశారు. ప్రభాస్ కు తప్పకుండా పెళ్లి జరుగుతుంది.. చేయాలని నాకు ఉంది అని పెద్దమ్మ శ్యామలాదేవి వివరించారు. శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి జరుగుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు.