ప్రముఖ నేపథ్య గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ మరణించారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో… ముంబయ్ లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు లతా మంగేష్కర్. జనవరి లో కరోనా బారిన పడిన లతా మంగేష్కర్.. దాదాపు 20 రోజుల పాటు కరోనా మహమ్మారితో పోరాటం చేసి.. ఇవాళ మరణించారు.
ఇప్పటికీ సినీ ప్రముఖులు ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా లతా మంగేష్కర్ పార్థివదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ముంబై లో ఏర్పాట్లు చేశారు. అయితే ముంబై లో జరగనున్న ఈ శోభాయాత్ర కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరి ముంబై చేరుకున్నారు. మరి కాసేపట్లోనే శోభాయాత్రలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆమె అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రధాని మోడీ. కాగా లతా మంగేష్కర్ అంత్యక్రియలు… సాయంత్రం 6:15 గంటలకు శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి.