తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

-

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ని తాజాగా సీఈసీ  విడుదల చేసింది. తెలంగాణలో ఎమ్మెల్సీలు మహముద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, బేరి సుభాష్ రెడ్డి, ఎంఐఎం నుంచి రియాజుల్ హుస్సెన్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. దీంతో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 05, తెలంగాణలో 05 ఖాళీలు ఉన్నాయి.

వీటికి సంబంధించి మార్చి 03న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న పోలింగ్ జరుగనుంది. అదే రోజు కౌంటింగ్ జరుగనుంది. ఏపీలో జంగా కృష్ణామూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావుల యొక్క పదవీ ముగియనుంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు ఏపీలో వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో 5 ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి ప్రభుత్వమే దక్కించుకునే అవకాశం ఉంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version