బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే.. బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు చేసారు పోలీసులు. కానీ ఈ రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అధికారులు. 100- 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని.. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు బెంగళూరు పోలీసులు.. రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ, సినీనటులు, రాజకీయ, వ్యాపారవేత్తలు ఉన్నారని చెబుతున్నారు.
MDMA డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రేవ్ పార్టీలో పట్టుబడివారి శాంపుల్స్ సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిందెవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో 71 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నటి హేమ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయినట్లు సమాచారం.. హైదరాబాద్ లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన వీడియోపై మరో కేసు కూడ పెట్టినట్లు సమాచారం.