ప్రముఖ హీరోయిన్ తాప్సి పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకెళితే గతంలో కూడా చాలామంది నటీనటులు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని.. వారి దుస్తుల ఎంపిక, నడవడిక సముచితంగా లేవని.. ఫిర్యాదులో దాఖలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా మత గురువుల నుంచి రాజకీయ నాయకుల వరకు అనేక సందర్భాలలో తారలు హెచ్చరికలు ఎదుర్కొన్నారు.. గత కొన్ని రోజుల క్రితం అమీర్ ఖాన్ ,రణవీర్ సింగ్ నగ్న ఫోటోలతో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నేహా దూపియా, లారాదత్త , కంగనా సహా చాలా మంది అందాల కథానాయకులు బోల్డుగా అందాలను ఆరబోసి మళ్ళీ వివాదం సృష్టించారు.
ఇక మహిళా సంఘాలలో తీవ్ర వ్యతిరేకతలు నెలకొన్నాయి. ఇప్పుడు అదే ఆరోపణలు తాప్సీ పన్ను కూడా ఎదుర్కొంటుంది. ముంబై లాక్మీ ఇండియా ఫ్యాషన్ వీక్ లో తాప్సీ టూ మచ్ బోల్డ్ లుక్ లో కనిపించడం వివాదానికి దారితీసింది. హింద్ రక్షక్ సంఘటన్ సభ్యుడు, బిజెపి ఎమ్మెల్యే మాలిని గౌడ్ కుమారుడు ఏకలవ్య సింగ్ తాప్సిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు . తాప్సి మెడలోని భారీ లాకెట్లో లక్ష్మీదేవి విగ్రహంతో ఆలయాన్ని తలపించే ఆభరణాల అలంకరణతో కనిపించిన ఈమె.. ఘాటుగా అందాలు ఆరబోసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇక తాప్సిపై నమోదైన ఫిర్యాదు గురించి ఒక పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ..” మతపరమైన మనోభావాలు భారతీయ సనాతన ధర్మ ప్రతిష్టను దెబ్బతీసినందుకు నటి తాప్సీ పన్ను పై ఏకలవ్య గౌడ్ నుండి మాకు ఫిర్యాదు అందింది . ప్రస్తుతం ఆ లాకెట్ ధరించడం పై ఫిర్యాదు అందింది కాబట్టి విచారణ సాగుతోంది” అంటూ అధికారి తెలిపారు. అందమైన ఎరుపు రంగుగౌన్లో లక్ష్మీదేవి విగ్రహంతో రూపొందించిన లాకెట్ అలంకారాలతో ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై నడిచింది ఈ ముద్దుగుమ్మ. అయితే దీనిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని కలిగి ఉన్న స్టేట్మెంట్ నెక్ పీస్ తో టూ మచ్ మోడ్రనైజ్ దుస్తులను ధరించడం సరికాదు అంటూ సింగ్ ఆరోపిస్తున్నారు.