హీరోయిన్స్ పడుతున్న కష్టానికి తగ్గట్టు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే – సమంత

-

హీరోయిన్స్ పడుతున్న కష్టానికి తగ్గట్టు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేని టాలీవుడ్‌ బ్యూటీ సమంత పేర్కొన్నారు. సమంత తాజాగా శాకుంతలం సినిమా కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సమంత చేసిన ఇంటర్వ్యూ నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది.. సమంత తన ఆరోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.

ప్రస్తుతం తాను ఎలా ఉంటున్నానో కూడా అభిమానులతో పంచుకుంది. ఇకపోతే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా షూటింగ్లు చేయడమే ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా హీరోయిన్స్ పడుతున్న కష్టానికి తగ్గట్టు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేని టాలీవుడ్‌ బ్యూటీ సమంత పేర్కొన్నారు. అలాగని ఖచ్చితంగా మాకు ఇంత ఇవ్వాల్సిందేని డిమాండ్ చేయడంతో పాటు మాకు ఇంత ఇవ్వండి అంటూ యాచించాల్సిన అవసరం కూడా లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో ఎందరో హీరోయిన్స్ గొప్పగా కష్టపడుతున్నారని, రాబోయే రోజుల్లో భారతీయ సినిమా పరిశ్రమ మరింతగా వృద్ధి చెందాలని తాను ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version