హైదరాబాద్లో సలార్ ఫ్యాన్స్ హంగామా.. సంధ్య థియేటర్ వద్ద అభిమానులపై లాఠీఛార్జ్

-

సినిమా ప్రేక్షకులు ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘సలార్’ మూవీ ఘనంగా విడుదలయ్యాయి. ఎక్కడ చూసినా థియేటర్లు కిక్కిరిసిపోయాయి. భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, అభిమానుల సందడితో థియేటర్ల పరిసరాలు సందడిగా మారాయి.

ముఖ్యంగా హైదరాబాద్లో ప్రభాస్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. థియేటర్ల వద్దకు తెల్లవారు జాము నుంచే చేరుకోవడంతో సందడి కనిపిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద అభిమానులు నానా హంగామా సృష్టించారు. అభిమానుల తాకిడి ఎక్కువవ్వడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభాస్ జిందాబాద్ అంటూ థియేటర్ గేటు దూకి లోపలికి అభిమానులు దూసుకెళ్లడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వారిని అదుపు చేసేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఆవరణ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వైఖరిపై అభిమానులు మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ కోసం ఇన్నాళ్లూ ఎదురుచూసి ఇవాళ సంబురాలు చేసుకుంటుంటే ఇలా దాడులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version