ఏపీ శాసన మండలిలో అచ్చెన్నాయుడు, బొత్సల మధ్య మాటల యుద్ధం..!

-

శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని.. గతంలో కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు అచ్చెన్నాయుడు. జగనన్న కాలనీలు అన్నారని.. దానికి గురించి ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. 2014-19 మధ్య ఇళ్లు కట్టిన వారికి తమ ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవం అని ఫైర్ అయ్యారు బొత్స సత్యనారాయణ.

అర్హులైన లబ్దిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చామని.. అర్హత లేకుండా కట్టుకొని బిల్లులు కావాలన్నా వారికి మాత్రమే ఇవ్వలేదని బదులిచ్చారు. రాజకీయ కక్ష్యలతో ఇవ్వలేదని చెప్పడం సరికాదని అచ్చెన్నాయుడుతో బొత్స పేర్కొన్నారు. మేము పేదలకు ఇళ్లు కట్టించాలనే మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మీరు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని అచ్చెన్నాయుడు పేర్కొనగా.. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడుతారా..? కేవలం కార్యకర్తలకు ఇవ్వమనడానికి ఇదేమైనా వాళ్ల సొంత ఆస్తా..? మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చామని బదులిచ్చారు బొత్స.

Read more RELATED
Recommended to you

Exit mobile version