బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు

-

రియాల్టీ షో బిగ్‌బాస్‌-7 ఫైనల్స్‌ రోజున జరిగిన ధ్వంసం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకులైన ఎండెమోల్‌షైన్‌ ఇండియా సంస్థకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫైనల్స్ రోజున స్టూడియో వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చినా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. అభిమానులు వస్తారని తెలిసినా ముందస్తు రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. నిర్వహణకు సంబంధించి సెన్సార్‌ బోర్డు అనుమతులున్నాయా..? అంటూ నోటీసుల్లో పలు ప్రశ్నలను సంధించారు. వాటికి రెండు, మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు.

ఫైనల్ ఎపిసోడ్ రోజున విన్నర్ పల్లవి ప్రశాంత్‌తోపాటు మరో పోటీదారు అమర్‌దీప్‌ అభిమానులు భారీగా చేరుకొని ఆర్టీసీ, ప్రైవేటు, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పల్లవి ప్రశాంత్‌, అతని సోదరుడు, మరికొంత మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించగా తాజాగా పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడికి కోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version