కాంతారా సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూజా హెగ్డే..!

-

దేశవ్యాప్తంగా కాంతారా చిత్రం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ఆ తర్వాత అన్ని భాషలలో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. విడుదలైన ప్రతి చోట కూడా భారీగానే కలెక్షన్లు రాబడుతోంది కాంతారా చిత్రం. హీరోగా , డైరెక్టర్ గా రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్లో అదిరిపోయేటువంటి సన్నివేశాలు ఉండడంతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగిందని చెప్పవచ్చు. అందుచేతనే ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల సైతం తమ అభిప్రాయంగా ఈ సినిమా గురించి తెలియజేశారు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నారు. ఇక టాలీవుడ్లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ చిత్రాన్ని చూసి ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉందని కితాబ్ ఇచ్చింది. ఓ ప్రాంతీయ సాంస్కృతిని అందరికీ చేరువయ్యేలా తీర్చిదిద్దారని ఆమె తెలియజేసింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికలో కాంతర సినిమా గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. మీకు ఏం తెలుసో.. అదే కదా రాయండి. మీ మనసుకు చేరువైన.. మీ హృదయంలో నుంచి వచ్చిన కథలనే ప్రేక్షకులకు చెప్పండి అంటూ రాసుకొచ్చింది..

ఇక తర్వాత ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని.. ఆ విజువల్స్ నటీనటులకు ప్రదర్శన నేను చలించిపోయానని ముఖ్యంగా హీరో రిషబ్ శెట్టి కాంతార విశేషమైన ఆదరణ పొందినందుకు తనకు చాలా గర్వంగా ఉందని..నా చిన్నతనంలో చూసిన భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించారు. రానున్న రోజుల్లో నువ్వు మరెన్నో ప్రశంసలు అందుకుంటారు అని రేషబ్ శెట్టి పైన రాసుకొచ్చింది పూజ హెగ్డే.

Read more RELATED
Recommended to you

Exit mobile version