తమిళ్ వాళ్లని పొగుడుతూనే పొగ పెడుతున్న పోసాని.. కట్ చేస్తే..!

-

గత కొన్ని రోజుల క్రితం తమిళ సినీ పరిశ్రమ.. వాళ్ళ సినిమాలలో తమిళ వాళ్లే ఉండాలి.. తమిళనాడులోనే షూటింగ్ చేయాలి.. మొదట ప్రాధాన్యత తమిళ్ వాళ్ళకి ఇవ్వాలి అని.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమణి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ఈ రూల్స్ పెట్టారని పలు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇవి పాటించని వాళ్లపై చర్యలు కూడా తీసుకుంటామని తెలిపినట్లు గమనార్హం. వాస్తవానికి ఇటీవల పాన్ ఇండియా సినిమాలు యాక్టర్స్ అందరూ.. అన్ని పరిశ్రమల్లో నటిస్తూ సినిమాలను హై రేంజ్ కి తీసుకెళ్తున్న నేపథ్యంలో తమిళ్ పరిశ్రమ ఇలాంటి రూల్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని.. అన్ని సినీ పరిశ్రమల నుంచి విమర్శలు వస్తున్నాయి.

అంతేకాదు కొంతమంది తమిళ్ వాళ్ళు కూడా దీనిని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మాట్లాడుతూ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని విమర్శించారు. తాజాగా ఈ విషయాలపై నాజర్ కూడా స్పందిస్తూ తమిళ్ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రూల్స్ ఏవీ లేవు అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు మళ్లీ తమిళ్ పరిశ్రమ నిర్ణయాలపై పోసాని కామెంట్లు చేయడం జరిగింది. నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఓటు వేయడానికి వచ్చిన పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడారు.

దీనిపై పోసాని మాట్లాడుతూ.. తమిళ వాళ్లు చాలా మంచి వాళ్ళు.. మేము తమిళనాడులో పరిశ్రమ ఉన్నప్పుడు అందరూ మాకు సపోర్ట్ ఇచ్చారు. ఇలాంటి నిర్ణయాలతో తమిళ్ వాళ్లే ముందు ఒప్పుకోరు. కమలహాసన్, విజయ్ , రజినీకాంత్ లాంటి స్టార్స్ అసలు ఒప్పుకోరు.. సెల్వమని ఇప్పుడు యాక్టివ్ గా లేడు.సినిమాలు తీయట్లేదు అంటే ఆయన తమిళ పరిశ్రమ అంతా అన్నట్టు కాదు.. అది జరగని పని కదా.. మనవాళ్ళు అక్కడ సినిమాల్లో కూడా చేస్తున్నారు.. వాళ్ళు ఇక్కడ సినిమాలలో చేస్తున్నారు. ఎవరో సెల్వమని అనంతమాత్రాన ఇవన్నీ జరిగిపోతాయా అంటూ ఒకవైపు తమిళ సినీ ఇండస్ట్రీని పొగుడుతూనే మరొకవైపు పొగ పెట్టే ప్రయత్నం చేశారు. దీనితో ఈ వార్తలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version