పర్యాటక రంగం పై మంత్రి జూపల్లి కీలక ప్రకటన

-

పర్యాటక రంగంలో తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. మాదాపూర్ లోని హైటెక్స్ లో నిర్వహించిన ట్రవెర్నియా ఫెస్ట్ కు చీఫ్ గెస్ట్ గా మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పర్యాటకులతో పాటు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు ఆయా పనుల నిమిత్తం తెలంగాణకు వచ్చే వారిని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు పలు పథకాలు చేపడుతున్నట్టు తెలిపారు. 

Jupalli

వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్ కి అంబాసిడర్లుగా నిలవాలని కోరుతున్నామని తెలిపారు. త్వరలోనే టూరిజం ప్రమోషన్ కోసం నూతన కమిటీ వేయబోతున్నట్టు ప్రకటించారు. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version