ప్ర‌భాస్‌, అనుష్క‌లు మ‌ళ్లీ ఒకే ట్రాక్‌పైకి..? గుప్పుమంటున్న వార్త‌లు..!

-

బాహుబ‌లి మూవీలో బాహుబ‌లి, దేవ‌సేనల మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ రీల్ లైఫ్‌కే ప‌రిమిత‌మ‌ని, రియ‌ల్ లైఫ్‌లో త‌మ ఇద్ద‌రి మ‌ధ్యా ఏమీ లేద‌ని వారిద్ద‌రూ ఆ వార్త‌ల‌ను ఖండించారు. అయితే తాజాగా మ‌రోసారి ఈ జంట గురించిన వార్త‌లు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

బాహుబలి 2 మూవీ రిలీజ్ అయ్యి 2 ఏళ్ల‌కు పైగానే అవుతోంది. అయినా ఇప్ప‌టికీ ఆ మూవీని చూస్తే మ‌న‌కు ఫ్రెష్ ఫీలింగ్ క‌లుగుతుంది. ఇక అందులో న‌టించిన ప్ర‌భాస్‌, అనుష్క‌ల మ‌ధ్య ప్రేమ కొన‌సాగుతుంద‌ని ఆ మూవీ రిలీజ్‌కు ముందే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ ఇద్ద‌రూ ఆ వార్త‌ల‌ను కొట్టిపారేశారు. బాహుబ‌లి మూవీలో బాహుబ‌లి, దేవ‌సేనల మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ రీల్ లైఫ్‌కే ప‌రిమిత‌మ‌ని, రియ‌ల్ లైఫ్‌లో త‌మ ఇద్ద‌రి మ‌ధ్యా ఏమీ లేద‌ని వారిద్ద‌రూ ఆ వార్త‌ల‌ను ఖండించారు. అయితే తాజాగా మ‌రోసారి ఈ జంట గురించిన వార్త‌లు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ప్ర‌భాస్, అనుష్క‌లు ఇద్ద‌రూ 2 ఏళ్ల కింద‌ట విడిపోయార‌ని, అయితే ఈ జంట మ‌ళ్లీ క‌లిసింద‌ని, ఈ క్ర‌మంలోనే వీరు త‌మ మ‌ధ్య ఉన్న బంధాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకునేందుకు య‌త్నిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఇద్ద‌రూ ఇప్పుడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు చూస్తున్నార‌ట‌. ఇక వివాహం అయితే అందులోనే ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అలాగే ఈ మ‌ధ్యే ప్రభాస్ అనుష్క కోసం త‌న తాజా చిత్రం సాహో మూవీ స్పెష‌ల్ షో కూడా వేయించాడ‌ట‌.

కాగా ప్ర‌భాస్‌, అనుష్క‌ల‌పై మ‌రోసారి వస్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక కూడా ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అందులో పైన తెలిపిన వివ‌రాల‌ను ఆ పత్రిక తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో మ‌రోసారి ఈ జంట‌పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై అటు ప్ర‌భాస్‌, ఇటు అనుష్క ఎవ‌రూ స్పందించ‌లేదు. మ‌రి ఈ జంట ఎలాంటి షాకులిస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version