ఓటీటీలోకి ‘కల్కి’.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ లో రికార్డులు సృష్టించింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్, రిలీజ్ డేట్ కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. దానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఏ రోజున కల్కి సినిమా ఓటీటీలోకి వస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు తెరదించుతూ కల్కి టీమ్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 22వ తేదీ నుంచి కల్కి సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఈ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version