సూడాన్‌లో పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) బలగాలు జరిపిన కాల్పుల్లో దాదాపు 80 మంది దుర్మరణం చెందారు. బాలికను కిడ్నాప్ చేసేందుకు ఆర్ఎస్ఎఫ్ ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికులు అడ్డుకోవడంతో సెంట్రల్ సూడాన్‌లోని సిన్నర్‌లో పారామిలటరీ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎఫ్ మాత్రం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
న్నార్ స్టేట్‌లోని జలక్ని గ్రామంలో ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా. తాము తీవ్రంగా పోరాడి ప్రతిఘటించారు. దీంతో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కాల్పులకు తెగబడ్డాయని.. ఇందులో 80 మందికిపైగా మృతి చెందగా.. చాలామంది గాయాలపాలయ్యారని స్థానికులు తెలిపారు. గత జూన్ నుంచి ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాల నియంత్రణలోనే ఈ ప్రాంతం ఉంటోంది. దాదాపు 7.25 లక్షల మంది ఇప్పటివరకు వెళ్లిపోయినట్లు అంతర్జాతీయ మైగ్రేషన్ సంస్థ తెలిపింది. సుడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య దాడుల వల్ల గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 16,650 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.