Saaho Collections : ‘ సాహో ‘ ఏపీ, తెలంగాణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

-

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాపై ఉన్న హైప్‌తో పోలిస్తే అంచ‌నాలు అందుకోవ‌డంలో కాస్త త‌డ‌బ‌డింది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. భారీ హైప్‌, సోలో రిలీజ్‌, ప్ర‌మోష‌న్లు తొలి రోజు భారీ వ‌సూళ్లు తెచ్చిపెట్టాయి. సాహో మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 37 కోట్ల షేర్ సాధించింది.

తొలి ఈ రేంజ్‌లో బ్యాడ్ టాక్ వ‌చ్చినా రూ.37 కోట్ల షేర్ అంటే ఓకే అనాలి. బాహుబ‌లి 2 సినిమాకు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తేనే తొలి రోజు రూ.43 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అయితే బాహుబ‌లి వ‌చ్చి కూడా రెండు సంవ‌త్స‌రాలు అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి కొద్ది సేప‌ట్లోనే ఏరియాల వారీగా ఎంత షేర్ వ‌సూలు చేసిందో వివ‌వ‌రాలు రానున్నాయి.

తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు చూసుకుంటే బాహుబ‌లి 2 త‌ర్వాత సాహోవే అత్య‌ధిక వ‌సూళ్లు కావ‌డం విశేషం. సోమ‌వారం వినాయ‌క‌చ‌వితి నేష‌న‌ల్ హాలీడే క‌లిసొచ్చింది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కూడా క‌లిసి రానుంది. ఫ‌స్ట్ వీకెండ్ వ‌ర‌కు సాహో బెట‌ర్‌గా పెర్పామ్ చేసినా ఓ మోస్త‌రుగా గ‌ట్టెక్కే ఛాన్సులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news