ప్రభాస్ స్పిరిట్.. మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్

-

పాన్ ఇండియా హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రం స్పిరిట్. పోలీస్ డ్రామాగా ఇది సిద్దం కానుంది. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది నుంచి ఈ మూవీ షూట్ ప్రారంభం కానుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని స్పిరిట్ టీమ్ స్పెషల్ అప్ డేట్ ఇచ్చింది. మ్యూజిక్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ మేరకు చిత్ర సంగీతం దర్శకుడు హర్షవర్థన్ రామేశ్వర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 

హర్షవర్ధన్, సందీప్ ట్యూన్స్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం నెటిజన్ల దృష్టికి ఆకర్షిస్తోంది. అర్జున్ రెడ్డితో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. సందీప్ రెడ్డి వంగా. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కింది. యానిమల్ తరువాత సందీప్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో ప్రభాస్ అభిమానుల్లో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version