ప్రేమ పిపాసి ఘాటు ప్రేమ వ‌ర్క‌వుట్ అవుద్దా?

-

ఈ మ‌ధ్య చిన్న సినిమాలు వెరైటీ క‌థ‌నాల‌తో వ‌స్తున్నాయి. కొత్త కొత్త క‌థ‌ల‌తో ఫిల్మిమేక‌ర్స్ కొత్త‌గా చూపిస్తున్నారు. అలాంటి వెరైటీ చిత్ర‌మే ప్రేమ పిపాసి. ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకం పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గాశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రేమ‌పిపాసి (స‌ర్చింగ్ ఫ‌ర్ ల‌వ్‌) అనే ట్యాగ్ లైన్‌తో మొద‌టైంది. .పి.ఎస్‌.రామ‌కృష్ణ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ముర‌ళీరామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిపిఎస్‌, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షివ‌ర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

పి. ఎస్ రామ‌కృష్ణ‌మాట్లాడుతూ… ఇది నా ఫ‌స్ట్ ప్రొడ‌క్ష‌న్‌. ముర‌ళీ రామ‌స్వామిగురించి ప్ర‌త్యేకించి నేను చెప్ప‌క్క‌ర్లేదు. టీజ‌ర్ చూసిన మీకు ఆల్రెడీ తెలుసు. హీరో జిపిఎస్ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద మీరు ఆల్రెడీ  చూశారు. ఎంతో అద్భుత‌మైన ట్రెండింగ్ హీరో మా ప్రొడ‌క్ష‌న్ ద్వారా ప‌రిచ‌యం అవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది. హీరోయిన్స్ అంద‌రూ చాలా గ్లామ‌ర‌స్. మా సినిమా అంతా బ‌య‌టే షూట్ చేశారు. ఎక్క‌డా ఖ‌ర్చుకి వెన‌కాడ‌లేదు. సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని త్వ‌ర‌లోనే మీ ముందుకు తీస‌కువ‌స్తాం. రిలీజ్ డేట్ కూడా త్వ‌ర‌లోనే చెపుతాం అని అన్నారు. నా ఫ్రెండ్ యుగేంధ‌ర్‌గారి వ‌ల్లే నేను ఈ సినిమాని ఇంత ముందుకు తీసుకురాగ‌లిగాను.

డైరెక్ట‌ర్ మాట్లాడుతూ… బొమ్మ‌చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంట‌దికాబ‌ట్టే పోస్ట‌ర్ బ్లాక్ అండ్ వైట్ వేశాము.  నేను చాలా రా కంటెంట్ తీశాను. నేను చాలా నీట్‌గా తీశాను.  పైకి క‌న‌ప‌డే మ‌నిషి వేరు లోప‌ల క‌న‌ప‌డే మ‌నిషి వేరు అదే ఈ సినిమా.  కంప్లీట్ యాక్ష‌న్, కామెడీ, ల‌వ్‌,  ఎంట‌ర్‌టైన‌ర్ ఈ చిత్రం. మూవీ అంటే ఒక క్యారెక్ట‌రైజేష‌న్ అని అన్నారు.

హీరో జిపిఎస్ మాట్లాడుతూ… ఇండ‌స్ట్రీలో ట్రై చేస్తూ విర‌క్తి పుట్టి ఇంటికెళ్ళిపోదాం అనుకునే స‌మ‌యంలో ఎంత ఎఫ‌ర్ట్ పెడ‌తామో అలా ఈ  చిత్రానికి పెట్టాను. నాకు హీరో గా ఈ అవ‌కాశం ఇచ్చిన ఆర్‌.కె.గారికి, రాహుల్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. రామ‌కృష్ణ‌గారి గురించి చెప్పాలంటే చాలా బాగా ఎంక‌రేజ్ చేశారు. బ‌డ్జెట్‌ గురించి ఆలోచించొద్దు అని చాలా బాగా కోప‌రేట్‌చేశారు. బ్రేక్ ద రూల్స్ అదే మా సినిమా అన్నారు. మా డైరెక్ట‌ర్ ఎక్స్‌ట్రాడిన‌రీ టాలెంటెడ్‌.  సినిమాలో నా క్యారెక్ట‌రైజేష‌న్ సూప‌ర్ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version