టూ పీస్ బికినీలో అందాల రచ్చ చేస్తున్న ప్రియా ప్రకాష్..!

-

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు చెప్పగానే కన్నుగీటిన వీడియో వెంటనే మన కళ్ళముందు తారసపడుతుంది. ఒక వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలయాళీ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే స్టార్డం దక్కించుకొని వరుసగా ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ టూర్లు , వెకేషన్ లకి వెళ్తూ రచ్చ చేస్తున్న ఈమె తాజాగా మరొక వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రియా ప్రకాష్ .ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా బీచ్ లో టూ పీస్ బికినీ ధరించి సందడి చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది . ఇవి చూసిన నెటిజనులు అంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సముద్రపు ఒడ్డున బ్లూ కలర్ బికినీ ధరించి చిందులేస్తున్న ఈమె సముద్రాన్ని తలపిస్తోంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మండుటెండలో ఇలా మరింత హాట్ డోస్ పెంచుతూ నీటితో ఆడుకుంటున్న ఈమె ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈమెకు అవకాశాలైతే పెద్దగా రాలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కనీసం ఈమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు వస్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బ్రో చిత్రంపై ఆశలు పెట్టుకున్న ఈమెకు ఎలాంటి విజయం లభిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version