Radhe Shyam : “రాధేశ్యామ్” ట్రైలర్ రిలీజ్… యాక్టింగ్ తో ఇరగదీసిన ప్రభాస్

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యాం. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా యువి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్‌ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఇక ఈ ట్రైలర్ లో… భవిష్యత్తు చెప్పే ఓ జ్యోతిష్కుడిలా ప్రభాస్ కనిపించాడు. అందరి చేతి రాతలు చూస్తూ… వారి భవిష్యత్తును చెప్పే పాత్రలో ఒదిగి పోయాడు ప్రభాస్. అలాగే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి ట్రైలర్ కంటే.. ఇవాళ విడుదలైన ట్రైలర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. కాగా ఈ సినిమా మార్చి 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version