రాజ్ కుంద్రా.. అశ్లీల వీడియోల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పోర్న్ గ్రఫీ కేసులో రాజ్ కుంద్రా పేరు చాలా సార్లు మారుమ్రోగింది. ఎక్కడ చూసినా అతడి పేరే వినిపించింది. ఆ సమయంలో మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించి మరి తిరిగాడు. ఎప్పుడు బయట కనిపించినా సరే ఏదో ఒక కొత్త రకం మాస్క్ తో బయట దర్శనం ఇస్తూ తిరిగాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లితో కలిసి పార్టీలకి కూడా తిరుగుతున్నాడని గతంలో ఒక షోలో వెల్లడించడం జరిగింది.
అంతేకాదు అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా షేర్ చేస్తూ రాజ్ కుంద్రా చెప్పిన ఈ మాటలు చాలా వైరల్ గా మారుతున్నాయి. తన భార్య శిల్పా శెట్టి మరదలు షమిత శెట్టితో కలిసి ఒక షోకి హాజరయ్యాడు. పెళ్లయిన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేది కాదు.. రాత్రి 9 అవ్వగానే శిల్పా శెట్టి నిద్రపోయేది. అయితే నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెల్ని పిలిచేవాడిని.. తాను మాత్రం ఎప్పుడూ నో చెప్పకుండా నాకు తోడు వచ్చేది..అందుకే బయటకు వెళ్లాలన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు ముందుగా షమిత గుర్తుకు వస్తుంది.
ఇక ఇంట్లో ఉండాలి.. పుస్తకాలతోనే కాలక్షేపం చేయాలి అన్నప్పుడు శిల్ప గుర్తుకువస్తుంది. శిల్ప నిద్రపోయినప్పుడే నేను షమితా తో కలిసి బయటికి వెళ్తాను. అందుకే ఆమెకు ఇప్పుడే పెళ్లి కావాలని నేను కోరుకోను అంటూ చెప్పుకొచ్చారు.