తిరుమల భక్తులకు అలర్ట్…ఇవాళ తిరుమల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల కానున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్లను నేడు అంటే గురువారం రోజున టీటీడీ విడుదల చేయనుంది.
ఇవాళ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవారి దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.