తన అన్నతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి చెల్లెలు..!!

-

ఫిలిం కంపోజర్ గా ప్లే బ్యాక్ సింగర్ గా , లేడీ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎం శ్రీలేఖ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1996 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె మొదట సింగర్ గా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. ఈమె ఎంఎం కీరవాణి సొంత సోదరి అని అందరికీ తెలిసిన విషయమే. కీరవాణి తర్వాత ఆయన సోదరుడు కళ్యాణి మాలిక్ కి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అయితే ఆయన కంటే ఎక్కువ స్థాయిలో సోదరి శ్రీలేఖ ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇండస్ట్రీలో ఇప్పటివరకు దాదాపుగా 80 కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇటీవల హిట్ 2 సినిమాకి కూడా ఆమె ఒక పాటకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. హిట్ 2 సినిమాకు రాజమౌళి రెకమెండ్ చేయడం వల్లే నాని ఆ విధంగా అవకాశం వచ్చేలా చేశాడని.. అంతేకాదు ఎక్కువగా కీరవాణి సపోర్ట్ తోనే ఆమెకు మ్యూజిక్ చేసే అవకాశాలు వచ్చాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరికొన్ని రూమర్స్ లో అయితే రాజమౌళి తన సినిమాలకు అవకాశం ఇవ్వకపోవడంతో కొంత విభేదాలు కూడా వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఎంఎం శ్రీలేఖ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు.

రాజమౌళి గారికి కీరవాణి మీద చాలా నమ్మకం వారిద్దరిది ఒక కాంబినేషన్.. అంతేకాకుండా రాజమౌళి గారికి ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు.. అందుకే నాకు అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో నా అవసరం పడితే తప్పకుండా ఆయన అవకాశం ఇస్తారు అని నేను అనుకుంటున్నాను అంటూ శ్రీలేఖ వెల్లడించింది. అంతేకాదు రాజమౌళి కుటుంబ సభ్యులతో ఎలాంటి విభేదాలు లేవని కూడా క్లారిటీ ఇచ్చింది శ్రీలేఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version