రామ్ – బోయపాటి “స్కంద” సినిమా సెన్సార్ పూర్తి

-

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం స్కంద. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా పలు భాషలలో ఆడియన్స్ ముందుకి రానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్లు జోరుగా జరుపుతుంది మూవీ యూనిట్. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేశాయి. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ ఈ చిత్రంలో పలు కీలక పాత్రలు పోషించారు. ఇక ఐటెం సాంగ్ లో ఊర్వశి రోటేలా కల్ట్ మామ పాటకు స్టెప్పులేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version